నడిగడ్డ ప్రగతిసభ కాదు,అబద్ధాల సభ. ఎం.ఎల్.ఏ రేవంత్ రెడ్డి.

హైదరాబాద్;
నడిగడ్డ ప్రగతి సభ కాదని, కేసీఆర్ అబద్ధాల ఆర్భాటపు ప్రజా సభ అని శాసనసభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి హేళన చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కేసులు వేస్తోందని శుక్రవారం గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆరోపించడాన్ని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కమీషన్ల కోసం పాలమూరు ప్రజలను బాధ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టొద్దని కేసులు వేయలేదని, ప్రాజెక్టు నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపైనే కేసులు వేశారని రేవంత్ రెడ్డి అన్నారు. భూములు కోల్పోయిన రైతులు ఆవేదనతో కోర్టుకు వెళ్లారని అన్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.