నయీమ్ అనే నేను……

2 గోనె సంచుల నిండా బంగారం..ఏకే47, సెనైడ్గ‌న్‌, 30విగ్గులు, 5మేక‌ప్ కిట్లు, 1000జ‌త‌లబ‌ట్ట‌లు, వంద‌ల డాక్యుమెంట్లు, ప్రామిస‌రీ నోట్లు, ఒక శాటిలైట్‌ ఫోన్ వంటి ప‌రిక‌రాల‌తోనయీం అనే ‘నరహంతకుడి పడకగది సోదా’ దృశ్యాలుగా మీడియా లో వచ్చిన కథనాలు. న‌యీంఅక్ర‌మంగా, బెదిరించి సంపాదించిన ఆస్థులుత‌వ్వే కొద్ది బ‌య‌టప‌డ్డాయి. అప్ప‌టికే వేల కోట్లు బ‌య‌టప‌డ‌గా.. ఇంకా బ‌య‌ట‌కు రాని లెక్క‌లుచాలానేఉన్న‌ట్లు వార్తా కథనాలు అప్పట్లో వెలువడ్డాయి.ఆ వందలు, వేళా కోట్ల డబ్బు, ఇతర సంపద ఏమైందో ఎవరికీ తెలియదు. మాజీ నక్సలైటు,పోలీసు మిత్రుడు నయీమ్ తో అవినాభావ సంబంధాలు కలిగినట్టు రుజువులు లభించిన కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి ప్రభుత్వం దదాపు నిర్ణయించింది. అధికారికంగా ఒకటీ, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చును.

ఎస్.కె.జకీర్.

నరహంతకుడు నయీంకు సహకరించిన అభియోగాలతో సస్పెన్షన్ కు గురైన అప్పటి సిఐడి అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, సిసిఎస్‌ ఎసిపిచింతమనేని శ్రీనివాస్‌, మీర్‌చౌక్‌ ఎసిపి మలినేని శ్రీనివాసరావు, సంగారెడ్డి సిఐ మస్తాన్‌వలి, కొత్తగూడెం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌లకు ఊరట లభించనున్నది. ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటీ, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నవి. నయీంతో సన్నిహితంగా వున్నట్లు ఫోటోలు వెలుగు చూడడం, ఇతర ఆధారాల వల్ల ఈ ఐదుగురిపై సర్కారు ‘వేటు’ వేసింది. దీంతో పాటు నయీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చిన మరో 20 మందికి గతంలో తాఖీదులు జారీ చేశారు.గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్టేట్ మెంట్ ను ‘ సిట్’ అధికారులు నమోదు చేశారు. భువనగిరి వ్యాపారి నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. నయీంతో తనకెలాంటి సంబంధం లేదని నేతి చెప్పినట్టు సమాచారం. అయితే నయీంతో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు వార్తాకథనాలు అప్పట్లో వెలువడ్డాయి. నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్‌ భూమి కొన్నట్టు ‘సిట్’ అధికారులు సాక్ష్యాలు సేకరించినట్టు కూడా పత్రికాలు వార్తలు ప్రచురించాయి. ఉమ్మడి ఎపిలో దశాబ్దంన్నర కాలం పాటు మాఫియా సామ్రాజ్యం నిర్వహించి 2016 ఆగస్టు 8న పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన అలియాస్‌ నయీం కేసు విచారణ అటకెక్కినట్లుగా కనిపిస్తోంది. ఈ కేసు విచారణ మూడు నెలల్లో ముగిస్తామని ప్రకటించిన పోలీసు ఉన్నతాధికారులు రెండేళ్లుగా ఎటూ తేల్చడాం లేదు. నయీం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న బడానేతలు, బ్యూరోక్రాట్లు పోలీసు శాఖపై, ప్రభుత్వం పైనా ఒత్తిడి తెచ్చి మెత్తపడేలా చేశారన్నా ఆరోపణలు ఉన్నవి. తెలుగు రాష్ట్రాల్లో మాఫియా కార్యకలాపాలు నిర్వహించి వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ వర్గాలను హడలెత్తించి వందల కోట్ల రూపాయలను సంపాదించి, సొంతంగా ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పలుచోట్ల చాలా కాలంపాటు సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం వ్యవహారంపై పోలీసుల విచారణ పై మొదటినుంచీ అనుమానాలున్నాయి. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించి ఆ తరువాత పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారి పోలీసులతో చేతులు కలిపిన నయీం అనంతర కాలంలో మాఫియా డాన్‌గా ఎదగడం తెలిసిందే. దశాబ్దంన్నర కాలం పాటు అనేక వర్గాలను నయీం తన గ్యాంగ్‌తో హడలెత్తించి తెలంగాణలోని అనేక జిల్లాలలో సరికొత్త సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇదే సమయంలో హంతక ముఠాలను ఏర్పాటు చేసుకుని అనేక హత్యలు చేయడంతో పాటు అంతకు మించిన అరాచకాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో వేలాది ఎకరాల భూములను ఆక్రమించి వందల కోట్ల రూపాయలను సంపాదించడంతో పాటు అడ్డువచ్చిన వారిని నయీమ్ అతి కిరాతకంగా హత్యచేశాడు. తన సెటిల్మెంట్ల కోసం రంగారెడ్డి, నల్లగొండ పరిధుల్లో ఓఆర్‌ఆర్‌కు సమీపంలో గల ఓ గ్రామంలో రహస్య స్థావరం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సా గించేవాడు. తన వద్దకు సెటిల్మెంట్లకు వచ్చే వారిని ఎదురుగా ఎకె47 మొదలుకొని పదుల సంఖ్యలో తుపాకులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లు, బాంబులు, ఆరడుగులకు పైబడి మంచి శరీర సౌష్టవంతో వున్న పహిల్వాన్లను వుంచే వాడు. దీంతో సెటిల్మెంట్ల కోసం వచ్చే వారు ఈ దృశ్యాలను చూడగానే బెదిరిపోయి నయీం చెప్పినట్లు మసులుకుని అతడు ఎంత చెబితే అంత అన్నట్లు అంగీకరించే వారు. పసి బాలలపై అతని వికృత లైంగిక చర్యలు, వారి కిరాతక హత్యలు మరింత సంచలనం రేపాయి. నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత చోటు చేసుకున్న అనేక పరిణామాలు అనేక మలుపులు తిరగడంతో పాటు రాజకీయ, పోలీసు వర్గాలకు ఇందులో ప్రమేయం వున్నట్లు వార్తలు రావడం తీవ్ర ప్రకంపనలు రేపాయి. నయీంతో అంటకాగినట్లు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులు, ఐఎఎస్‌ అధికారులతో పాటు రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో కేవలం శాసనమండలి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌పైన మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా తదుపరి చర్యలు తీసుకోలేదు. విద్యాసాగర్‌ను సిట్‌ అధికారులు విచారించారని వార్తలను ఆయన ఖండించారు. ముగ్గురు ఎం.ఎల్‌.ఎలు, మరో ముగ్గురు ఎం.ఎల్‌.సిలతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు, కొందరు పోలీసు అధికారులు నయీంకు సహకరించినట్లు సిట్‌ ఆధారాలు సేకరించినా దీని పై ఎలాంటి ముందడుగు పడలేదు. తుంగతుర్తి ఎంఎల్‌ఎగ్యాదరి కిశోర్‌పై కేసు నమోదు చేసేందుకు ‘ సిట్‌’ చివరి నిమిషంలో వెనుకంజ వేసింది. మొత్తం మీద నయీం కేసును విచారించిన సిట్‌ అధికారులు 227 కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో 128 మందిని అరెస్టు చేయడంతో పాటు 109 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. 895 మంది సాక్షులను విచారించారు. నయీంకు సహకరించిన 14 మంది కరుడుగట్టిన నేరగాళ్లపై పి.డి యాక్టు అమలు చేసి జైలుకు పంపారు. కేసులో మొదటి నుంచి బడా రాజకీయ నేతలు, సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల పాత్రపై తీవ్రమైన అభియోగాలున్నాయి. పూర్వపు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో ఈ నాయకుల అండదండలతోనే నయీం తన అనుచరులతో కలిసి వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని సిట్‌కు ఆధారాలు లభించాయని వార్తలు వచ్చాయి. వీరి సహకారంతోనే నయీం ముఠా కొందరు వ్యాపారులతో పాటు ఇంకొందరు రాజకీయ నాయకుల నుంచి కోట్లాది రూపాయలను బలవంతంగా వసూలు చేయడం, సెటిల్మెంట్లకు పాల్పడడం, భారీగా ఆయుధాల ను సమకూర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో నయీంతో అంటకాగిన బడా నేతలు, అధికారులపై చర్యలుంటాయని సర్కారు నుంచి సంకేతాలు వచ్చినా చివ రి నిమిషంలో అది ఆగిపోయింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని డైరీ కూడా పోలీసులకు చిక్కింది. నయీం డైరీ గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రావడానికి కొందరు పోలీసు అధికారులు లీకులు ఇచ్చారు. కానీ ఆ తర్వాతే సీన్ మారింది. నయీం డైరీలోని పేజీలు ఒక్కోక్కటిగా మాయమయ్యాయి. డైరీలోని పెద్ద తలకాయల పేర్లు అసలు రికార్డులకే ఎక్కలేదు. కానీ పోలీసుశాఖలో కిందిస్థాయిలో ఆ సమయానికి జరుగుతున్న ప్రమోషన్ల యుద్ధం నయీం కేసుపై ప్రభావం చూపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కొందరు పదోన్నతుల వివాదంలో చురుకైన పాత్ర పోషించడంతో అదను చూసి వారిపై వేటు వేయించాలనే ప్రచారం పోలీస్‌శాఖలోజోరందుకుంది. నయీంతో దోస్తీ చేసిన 25 మంది పోలీసులపై చర్యలకు పోలీసు శాఖ పూనుకున్నది. నయీం సెటిల్‌మెంట్లు రూ.20 వేల కోట్ల పైనే ఉన్నాయని పోలీస్ వర్గాలు అంచనావేశాయని అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి. నయీం పోలీసు ఉన్నతాధికారుల చేతిలో ‘ఆయుధం’గా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారు. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. భువనగిరిలో ప్రజాగాయనిబెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్ కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలేతెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకానయీమేమాస్టర్మైండ్అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్ కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి వంటి అనేక దారుణ హత్యలకు పాల్పడ్డారు. 1993 జనవరిలో ఐపిఎస్ అధికారి కెఎస్ వ్యాస్ ఎల్బిస్టేడియంలో వాకింగ్ చేస్తుండగా కాల్పులు జరిపి చంపిపారిపోయిన పీపుల్స్ వార్ దళం లో నయీమ్ ముఖ్యుడు. హైదరాబాద్ లో నయీంపై ఆ సమయంలో మొదటి కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత 2007లో ఉగ్రవాద కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాడు. పాకిస్థాన్ నుంచి అజ్మీర్ మీదుగా హైదరాబాద్ కు ట్రక్కులో ఎకె-47 ఆయుధాలు సరఫరా చేశాడు. ఈ సమాచారం అందుకున్న నగర సిసిఎస్ పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుతో పాటు ముజీబ్అహ్మద్ పట్టుబడ్డాడు. ఎకె-47ఆయుధా ల తరలింపులో నయీం సూత్రధారి కావడంతో సిసిఎస్ పోలీసులు క్రైమ్ నెంబర్ 786/2007లో నిందితుడిగా పేర్కొన్నారు. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, క్రాంతిసేన పేర్లతో నగరంలో అరాచకాలు సృష్టించాడు. ఈ పేరుతోనే దిలిసుక్ నగర్ పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తంతో పాటు మరికొందరిని హత మార్చాడు. ఆ తరువాత ఎల్బినగర్, ఉప్పల్, హయత్ నగర్, ఫిర్జాదీగూడ, నేరేడ్మెట్, కుషాయిగూడ, శంషాబాద్, పహాడీషరీఫ్, చంద్రాయణగుట్ట, మీర్పేట్ తదితర పోలీసు స్టేషన్లలో బలవంతపు భూ దందా సెటిల్మెంట్లు చేశాడు. ఇక దిల్ షుక్ నగర్ ర్లోని తన ఇంటి నుంచి నల్గొండలోని శుభకార్యానికి వెళ్లిన కొనపూరిరాములును కూడా దారుణంగా హత మార్చాడు. ఇక ఎల్బినగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధాకృష్ణను తన ఇంటి ముందే అతనిపై కాల్పులు జరిపి హత మార్చాడు. నయీం వేధింపులు భరించలేని పలువురు నగర ప్రజలు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు గతంలో ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.తమకు ప్రాణ హాని ఉందని కొనపూరి రాములు, అతని తండ్రి గతంలో ఎల్బినగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.గుజరాత్లో2005 నవంబర్ 26న రౌడీషీటర్ సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులోనూ నయీమ్ నిందితుడు. ఇతనిపై సిబిఐ పోలీసులు 2008లోనే రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అనుచరడు తులసీరామ ప్రజాపతీలు 2005 నవంబర్ 20న హైదరాబాద్ వచ్చారు.సాంగ్లీ వెళ్లేందుకు నవంబర్ 23న అఫ్జల్ గజ్ నుంచి సంగీత ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ఈ ముగ్గురిని ఆంధ్ర-కర్నాటక బోర్డర్లో నితదోలా వద్ద గుజరాత్ ఎసిఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన మూడు రోజులకే అహ్మదాబాద్లోని విశాల సర్కిల్ సమీపంలో సొహ్రాబుద్దీన్ఎన్కౌంటర్ అయ్యాడు. నవంబర్ 29న అతని భార్య కౌసర్బీని హతమార్చారు. గుజరాత్ ఎటిఎస్డిజి వంజారా స్వగ్రామైన ఇల్లోల్ గ్రామంలో మృతదేహాన్ని కాల్చేశారు. 2006 జనవరిలో సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ఎన్కౌంటర్లు బూటకమని సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో డొకంత కదిలింది. బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న ఐదుగురు గుజరాత్ పోలీసు అధికారులను సిబిఐ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. వీరికి సహాయం అందించింది నయీమని తరువాత తేలింది. 1998లో లొంగిపోయిన నక్సలైట్‌ ఈదన్నను తన వ్యక్తిగత కక్షతో జైలులో ఉండి నయీం చంపించిన తీరుతో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబి షాక్ కు గురయింది. తన చెల్లెలిని అవమానపరిచాడనే అక్కసుతో నయీంఈదన్నను నరికి, శిరస్సు వేరు చేసి కనుగుడ్లు తెచ్చి చూపాలని తమ్ముడు అలీముద్దీన్‌కు పని అప్పగించాడు. ఆ పనిచేసి ఆ కనుగుడ్లు పట్టుకొచ్చి జైలులో నయీంకు అతని తమ్ముడు చూపాడు. కోవర్టుగా పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు.కరీంనగర్‌ జిల్లా పీపుల్స్‌వార్‌ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్కాపురం భాస్కర్‌ (విజయ్‌)ను చంపే పనిని జడల నాగరాజు అనే దళ సభ్యునికి అప్పగించాడు. ఆ పని పూర్తి చేసినందుకు విజయ్‌ తల మీద ఉన్న బహుమతిని అప్పటి ఎచ్‌జె దొర, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి స్వయంగా జడల నాగరాజుకు అప్పగించారు. ఇది ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా ప్రదర్శింపబడింది. ” హత్య చేశానని స్వయంగా ఒప్పుకుంటున్న వ్యక్తికి ప్రభుత్వాలు బహుమానాలు ఇవ్వడం ఏమిట”ని అప్పటి ఎపిసిఎల్‌సి కార్యదర్శి బాలగోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ను అసలు విచారించనేలేదు.అజ్ఞాతంలో ఉన్న విప్లవ నాయకులతో సహా గంటి ప్రసాదం దాకా కోవర్టు హత్యలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నయీముద్దీన్‌ కోవర్టు నాయకత్వాన్ని వాడుకున్నది. గుజరాత్‌లో సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌, మాజీ హోంమంత్రి హిరేన్‌ పాండే హత్యలతో నయీంకు ఉన్న అంతకన్నా మించి గ్యాంగ్‌స్టర్‌గానయీం ముఠా చేసిన దుర్మార్గాలు, దురాక్రమణలు అన్నీ రాజకీయాల్లో, పోలీసు యంత్రాంగంలో స్వార్థ ప్రయోజనాలు పొందిన వాళ్లకు చాలా అవసరమైనవి. కోవర్టుగా చేసిన పనులన్ని దోపిడీ వర్గానికీ, రాజ్యానికీ అవసరమైనవి. కనుక హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చేదు నిజం అది. తన కార్యకలాపాలకు అడ్డురావద్దని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నయీంతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరించారని, అందుకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొర పెట్టుకుంటే నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయి.