నయీమ్ భూములు,సోమ్ములు ఎక్కడ? కాంగ్రెస్ అధికార ప్రతినిధి-గజ్జెల కాంతం

హైదరాబాద్:
నయిమ్ దగ్గర దొరికిన సొమ్ము కేసీఆర్ ఇంటికి వెళ్లిందా లేక ప్రబుత్వ ఖాతాలో జమ అయిందా చెప్పాలని టిపిసిసి అధికార ప్రతినిధి గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.నయిమ్ దగ్గర దొరికిన ఆస్తులు,సొమ్ము పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నయిమ్ బినామీ భూమి ఎటు పోయిందని ప్రశ్నించారు.నయీమ్ తో సంబంధాలున్న 25 మంది పోలీస్ అధికారుల పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.నయిమ్ తో చేతులు కలిపి పోలీస్ అధికారులు కూడా దోచుకున్నారని అన్నారు.నయీమ్ కు సహరించిన పోలీస్,రెవిన్యూ యంత్రాంగం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఈ ప్రభుత్వం దోపిడీ దారులకు అండగా నిలుస్తుందని గజ్జెల ఆరోపించారు.