నాగంకు భద్రత తొలగింపు. కేసీఆర్ తో తనకు ముప్పు ఉందన్న నాగం.

నాగర్ కర్నూలు.
ముఖ్యమంత్రి కుటుంబంతో తనకు ప్రమాదం ఉందని నాగం ఆరోపించారు. నాగం జనార్ధన్ రెడ్డి కి ప్రస్తుతం ఉన్న 1+1 సెక్యురిటి తొలగిస్తున్నట్లు జిల్లా ఎస్పి సన్ ప్రిత్ సింగ్ నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ రద్దు చేయడంతో ప్రభుత్వం పై నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న వేల కోట్ల అవినీతి పై తాను పోరాటం చేస్తున్నానని, కొన్నింటిపై కోర్టులో కేసులు కూడ వేశానని ఆయన గురువారం నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కుటుంబం కావాలనే పథకం ప్రకారం తన సెక్యురిటి ని తొలగించారని ఆరోపించారు. 25 సంవత్సరాల రాజకీయ నాయకుడినని, 2+2 సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిఐ స్థాయి అధికారులతో భద్రత కల్పిస్తున్నారని నాగం తెలిపారు. తనకు ఏమి జరిగినా కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు.