హైదరాబాద్;
బిజెపి నాయకుడు డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. నాగంచేరిక పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎం.ఎల్.సి.దామోదరరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శాసనసభ్యురాలు డి.కె.అరుణ గురువారం కాళికావతారంఎత్తారు. శుక్రవారం జరిగే కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఆమెప్రకటించారు. తనకుగద్వాలలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున తానుసిఎల్పీ సమావేశంలో పాల్గోనడంలేదన్నారు. నాగంచేరిక సమయం లో తన బాధ , మాటను ఎవరు వినలేదని నాగర్ కర్నూల్ కు చెందిన కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారనిడి.కె.అరుణ చెప్పారు . నాగం కి టికెట్ ఫైనల్ కానందున రాహుల్ గాంధీ దృష్టి కి తీసుకెళ్దామని తాను నచ్చజెప్పినట్టుడి.కె.అరుణతెలిపారు. ఆవేశం, ఆవేదన , బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ కి నష్టం అనితానుదామోదరరెడ్డికి స్పష్టం చేసినట్టు ఆమె వివరించారు. నాగర్ కర్నూల్ కార్యకర్తల ఫాలోయింగ్దామోదర్ రెడ్డికిఉందని అరుణ అన్నారు. తనకు తెలియకుండానే, చర్చ చేయకుండానే నాగం ను చేర్చుకున్నారంటూదామోదర్ రెడ్డి బాధ పడుతున్నారని ఆయన అన్నారు. దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ వైపు వెళ్తున్నారని, అయితే డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారంటూతనను ఇబ్బంది పెట్టాలనిప్రయత్నించడం రాజకీయ కుట్ర అనిఅరుణ ఆరోపించారు. ఎవరు ఇబ్బంది పెట్టినా, తనను టార్గెట్ చేసినా,తాను సిన్సియర్ కార్యకర్తను అని ఆమె చెప్పుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసమే తాను పని చేస్తానని ఆమె అన్నారు.
ఎవరు టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చోననిచెప్పారు. మహబూబ్ నగర్ లో గతంలో కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని,వర్గాల మాట ఇప్పుడే వినిపిస్తోందన్నారు.తన ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దేబ్బతీయలేరనిచెప్పారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే తన లక్ష్యమని డి.కే.ప్రకటించారు.తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ కె నష్టమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే నాయకులను చేర్చుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ నాగం చేరిక వల్ల బలమైన దామోదరరెడ్డి ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తున్నట్టు అరుణ అన్నారు. నాగం టీడీపీ లో బలమైన నాయకుడు కావొచ్చు కానీ కాంగ్రెస్ లో కాదని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా అని ప్రశ్నించారు.
దామోదర్ రెడ్డి ని కలిసి మాట్లాడానని, పార్టీ మార్పు ఆలోచన విరమించుకోవాలని కోరినా ఆయన వినడం లేదన్నారు.నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ కు దామోదర్ రెడ్డి చాలా కాలంగా అండగా ఉన్నారని అరుణ తెలియజేశారు. 2004 లో కేవలం 1400 ఓట్ల తో ఓడిపోయారని, అప్పుడు పొత్తులో భాగంగా టి.ఆర్.ఎస్. తరపున పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ లో కి వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ఎమ్మెల్సీ గా గెలిచిన దామోదరరెడ్డి వెంట పార్టీక్యాడర్ఉందనిడి.కె.గుర్తు చేశారు.