నాగం ను ఓడించండి. మర్రి ని గెలిపించండి -కూచకుళ్ల పిలుపు.

నాగర్ కర్నూలు:
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా యువకుడు, సేవాభావం గల మర్రి జనార్ధన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.పెద్దముద్దునూరు కాంగ్రెస్ ఎంపీటీసి రమణారావు ఆధ్వర్యంలో దాదాపు 500 టీఆర్ఎస్ పార్టీలో చేరారు.నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మర్రి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.పట్టణంలో మినీ టాంక్ బండ్, డివైడర్…మధ్యలో మొక్కలు, డ్రెయినేజీలాంటి ప్రత్యేక అభివృద్ధి జరుగుతుంది.నాగంను నమ్మితే నట్టేట మునగడం ఖాయం.నాగం వల్ల BJPలో పాత నాయకుల మాదిరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకూ అవమానం తప్పదు.నాగం వల్ల ముప్పై ఏళ్లలో జరిగింది లేదు…కొత్తగా ఏదీ జరగదు.పదవుల కోసమే పార్టీలు మారుతున్న నాగం.ప్రజలూ నాగంని నమ్మొద్దు…మోసపోవద్దు.రాజకీయ భవిష్యత్ ఉన్న, సేవా గుణం ఉన్న మర్రి జనార్ధన్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా ఒకేతాటిపై నిలిచి ఏకపక్షంగా గెలిపించుకుందాం” అని ఎమ్మెల్సీ కె.దామొదరరెడ్డి అన్నారు.