నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టడాన్ని తప్పుబట్టిన హైకోర్టు.

  • ఏపీ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు నోటీసులు.

విజయవాడ:
నిందితుల్ని మీడియా ముందు ప్ర‌వేశ పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిపికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.ఈ నెల 26కు కేసు విచార‌ణ వాయిదా వేసింది. ప్ర‌కాశం జిల్లాకు చెందిన కావ‌టి అలిమేలును ఓ కేసులో అనుమానిస్తూ మీడియా ముందుకు తీసుకొచ్చిన ఆత్మ‌కూరు డీఎస్పీ మాధ‌వ‌రెడ్డి.త‌న త‌ల్లిని మీడియా ముందుకు తీసుకురావ‌డంతో హైకోర్ట్ ను ఆశ్ర‌యించిన ప్ర‌కాశం జిల్లా ఆదినారాయ‌నపురంకు చెందిన కావ‌టి సాగ‌ర్.
నిందితుల్ని, అనుమానితుల్ని మీడియా ముందు చూపించే అధికారం పోలీసుల‌కు లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది.ఒక వేళ నిబంధ‌న‌లుంటే ఏ నిబంధ‌న అనుగుణంగా ఉందో చెప్పాలని హైకోర్ట్ కోరింది.కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశం.