నిర్ణీత గడువులోగా యాదాద్రి టెంపుల్ టౌన్ పనులు పూర్తి.

హైదరాబాద్:
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహా దేవాలయ పరిధిలో చేపడుతున్న వివిధ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అధారిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సి.యస్ YTDA ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై సమీక్షించారు. దేవాలయనిర్మాణ పనులను సకాలంలో పూర్తి కావాలని, కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ, రాయగిరి వద్ద ROB నిర్మాణం, తదితర పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తికావాలన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి అవసరమైన చోట ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ కిషన్ రావు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్, R&B ENC లు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఈ.ఓ గీత తదితరులు పాల్గొన్నారు