నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో..

 

న్యూ ఢిల్లీ:
నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని స్టైలిష్ స్టార్లలో ఆమె ఒకరు. లేటెస్ట్ ఫ్యాషన్స్ ఫాలో కావడంతో పాటు కొత్త ట్రెండ్స్ సృష్టించడం జేలో ప్రత్యేకత. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన జెన్నీ కొత్త లుక్ ఆమె ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. ప్యాంట్ కి బదులు మోకాళ్లపైకి వర్సాచీ డెనిమ్ బూట్స్ వేసుకోవడంపై ట్రోలింగ్ ప్రారంభించారు జెన్నిఫర్ విమర్శకులు.
డెనిమ్ బూట్స్ ని ప్రముఖ లగ్జరీ బ్రాండ్ వర్సాచీ తన రిసార్ట్ 2019 కలెక్షన్ లో భాగంగా తయారు చేసింది. ఈ బూట్స్ కి బ్యాక్ పాకెట్స్, బ్లాక్ బెల్ట్ అమర్చిన బెల్ట్ లూప్స్, బంగారం బ్రాండ్ లోగో.. డెనిమ్ ప్యాంట్స్ కి ఉండే అన్ని హంగులు ఉన్నాయి. ఈ బూట్స్ పైకి ఒక లూజ్ లాంగ్ స్లీవ్ తెల్ల చొక్కా వేసుకొని, న‌ల్లని క‌ళ్ళద్దాల‌తో బయటికొచ్చింది. అంతే.. ఈ లాటినాకి ఫ్యాషన్ సెన్స్ తో పాటు కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందని ఒకటే విమర్శలు.
అయితే అది తెలియ‌ని కొంద‌రు త‌న‌ జీన్స్ మోకాళ్ల వరకూ జారిపోయిన సంగతి జెన్నీ గుర్తించలేదా అని కామెంట్ చేశారు. కుంటూ ముచ్చ‌టించుకున్నారు. జెన్నిఫర్ లోపెజ్ ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇవి నెటిజ‌న్స్ రకర‌కాలుగా స్పందిస్తున్నారు.