పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.

హైదరాబాద్:
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీసీలకు ఏ ప్రాతిపదికన 34% రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. 2, 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. బీసీ-ఏ, బీ, సీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఏజీకి హైకోర్టు సూచించింది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.