పరువు నష్టం దావా కేసులో మాజీ డీజీపీ పేర్వారం రాములుకు వారెంట్.

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/06/dgp.jpg

Hyderabad:

పరువు నష్టం దావా కేసులో మాజీ డీజీపీ పేర్వారం రాములుకు సిటీ సివిల్ కోర్టు వారెంట్
జారీ చేసింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో కోర్టు ఆదేశించినా
కోర్టు ఆదేశాల అమలుకు పిటిషన్‌ వేసిన ఇన్‌స్పెక్టర్‌ మాధవరెడ్డి.2001లో భూకబ్జా కేసులో మాధవరెడ్డిని అరెస్ట్‌ చేయించిన నాటి సీపీ పేర్వారం రాములు. నాటి కమిషనర్ పేర్వారం రాములు తనను అక్రమంగా పిడీ చట్టం ప్రకారం అరెస్టు చేయించి చంచల్ గూడ జైల్లో పెట్టారని మాధవరెడ్డి ..కోటి రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశారు…ఈ కేసు విచారణ పూర్తి అయిన తర్వాత మాధవరెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారన్న విషయాన్ని గుర్తించిన న్యాయస్ధానం అతనికి 75లక్షల రూపాయలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి చెల్లించి ఆ మొత్తాన్ని పేర్వారం రాములు నుంచి రికవరి చేయాలని 2017 లో ఆదేశించింది..అయితే, ఈ ఉత్తర్వులు అమలు కానీ నేపధ్యంలో మళ్లీ మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో పేర్వారం రాములుకు కోర్టు వారంటు జారీ చేసింది.26వ తేదిన సిటి సివిల్ కోర్టులో కేసు విచారణ.