పల్లా రాజేశ్వరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లలో అక్రమాలు.

పల్లా రాజేశ్వరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లలో అక్రమాలు.
– చర్యలకు Ntvp డిమాండ్.

Hyderabad:

విచ్చల విడిగా డొనేషన్ ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న టీఆర్ ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (NTVP) డిమాండ్ చేసింది.పల్లా కు చెందిన
CVR కాలేజీ లో బహిరంగoగా డబ్బులు వసూలు చేస్తున్నా, విడియో బైటికి వచ్చినా ఉన్నత విద్యా మండలి చైర్మన్ చోద్యం చూస్తున్నారని ఆ సంఘం విమర్శించింది. ఆ కాలేజీ టిఆర్ఎస్ ఎంఎల్ సి రాజేశ్వర్ రెడ్డిది అయినందున మండలి చైర్మన్ పాపిరెడ్డి చర్యలు తీసుకోవడానికి బయటపడుతున్నట్టు
ఆరోపించారు.ప్రభుత్వ పెద్ద లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమలు చేపడుతున్నారని ntvp నాయకులు అంటున్నారు.ఇంజనీరింగ్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా( బి-కేటగిరి) సీట్లను ఆన్ లైన్ ద్వారా భర్తీ చేయాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (NTVP) రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి వినతిపత్రం సమర్పించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో బి- కేటగిరిలో అడ్మిషన్లు చేపట్టే సీట్లను ఆన్ లైన్ ద్వారా భర్తీ చేయాలని
Ntvp నాయకులు కోరారు.ఎమ్ సెట్ ఫలితాలను ప్రకటించిన తరువాతనే ఈ అడ్మిషన్ ప్రక్రియను చేపట్టాలని కోరారు.డొనేషన్ల పేరుతో అక్రమంగా పిజులు వసూలు చేస్తున్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.