పాక్ టివి ఛానల్లో సిక్కు న్యూస్ రీడర్!

లాహోర్:
పాకిస్తాన్ కు చెందిన ఊర్దూ వార్తా చానల్ ‘పబ్లిక్ న్యూస్’ తొలిసారిగా ఓ సిక్కు వ్యక్తి హర్మీత్ సింగ్ ను వార్తా వ్యాఖ్యాతగా నియమించుకుంది. ఈ విషయాన్ని పబ్లిక్ న్యూస్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ‘పాకిస్థాన్ కు చెందిన తొలి సిక్కు వార్తా వ్యాఖ్యాత హర్మీత్ సింగ్ కేవలం పబ్లిక్ న్యూస్ లోనే’ అని పేర్కొంది. పాకిస్తాన్ లో మైనారిటీలైన సిక్కులను అక్కడి వేర్పాటు వాద సంస్థలు లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఇటీవల పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ తరహా దురభిప్రాయాలకు తాను ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు హర్మీత్ సింగ్ పేర్కొన్నారు. మైనారిటీలకు పాకిస్తాన్ లో రక్షణ లేదన్న అభిప్రాయం తప్పు అని చెప్పారు. ప్రపంచంలో ఇతరులు ఎలా జీవిస్తున్నారో, పాకిస్తాన్ లో మైనారిటీలు కూడా అదే విధంగా జీవిస్తున్నారని వివరించారు.