పాజిటీవ్ డైరెక్షన్ లో సిద్ధిపేట! – హరీశ్ రావు:


Siddhipeta:

సిద్ధిపేట జిల్లా పరిషత్ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచి పోతుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.జిల్లా పరిషత్ సభ్యులు గొప్ప అనుభవం ఉన్నవారు, మంచి విద్యావంతులు ఎన్నికయ్యారు. మంచి టీమ్ వర్క్ తో సమిష్టిగా కలిసి పని చేయాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలని సూచించారు.పాజిటీవ్ డైరెక్షన్ లో జిల్లాను ముందుకు నడిపించాలని నూతన జిల్లా పరిషత్ సభ్యులను కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అయిన సిద్ధిపేట జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.”జిల్లాలో బాగా పనిచేసే అధికారులు ఉన్నారు., వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులతో జెడ్పీటీసీలు కలిసి పనిచేయాలి.కొత్త జిల్లాలో తొలి జడ్పి పాలకవర్గంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.
ఈ సారి జిల్లాకు మంచి జడ్పిటిసీ లు, పాలకవర్గం వచ్చింది.సభలో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే ఉదంగా ఉండాలి.సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలి.హెడ్ లైన్ వార్త ల కోసం అరిచి గగ్గోలు పెట్టికోవద్దు.ఆధికారులతో సామరస్య పూర్వకంగా, ప్రేమతో పనులు చేయించుకోవాలి.టీమ్ వర్క్ తో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రజాప్రతినిధులు వివిధ శాఖపై అవగాహన పెంచుకోవాలి.వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అనేక పనులు చేసుకోవచ్చు.
మన స్థాయి ఏదైనా మనమంతా ప్రజలకు సేవకులమే.నేనూ అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలి. పొరపాటు జరిగినప్పుడు బేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారు గొప్ప వారవుతారు”అని మాజీమంత్రి హరీశ్ చెప్పారు.