పార్టీ వ్యతిరేకి డి.ఎస్ పై చర్యకు టిఆర్ ఎస్ డిమాండ్. నో కామెంట్ అన్న డి.ఎస్.

  • నిజామాబాద్ అధికారపక్షంలో గరం, గరం.

నిజామాబాద్;
తెలంగాణా రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ తెలంగాణ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా టిఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో మంతనాలు సాగించారని వారు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఎంపీలు కవిత, పాటిల్, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కేసీఆర్ కు లేఖ పంపారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు డి.ఎస్. నిరాకరించారు. నిజామాబాద్ లోని తన నివాసంలో పెద్ద కుమారుడు సంజయ్ సహా తన మద్దతుదారులు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. సీఎంకు ఫిర్యాదు చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని డి.ఎస్.అంటున్నారు. ‘చేస్తాం అన్నది ఫిర్యాదు మాత్రమే కదా
నా గొంతు కోస్తాం అని చెప్పలేదు కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పార్టీలో పని చేస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదు’ అని కూడా డి.ఎస్.స్పష్టం చేశారు. ‘నేనిప్పుడే ఏం మాట్లాడలేను’ ని అన్నారు.