పుకార్లు సృష్టించవద్దు.నాకేమీ కాలేదు -హీరో రానా.

హైదరాబాద్:
గత కొంత కాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై రానా స్పందించారు. రానాకు కంటి సమస్య ఉందని, త్వరలో శస్త్రచికిత్స జరుగుతుందన్న వార్తలకు తోడు, ఓ టీవీ ఇంటర్వ్యూలో రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు కూడా కంటి చికిత్సపై మాట్లాడారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరగగా, మీడియాలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఇక ఈ వార్తలపై నేటి ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో రానా స్పందించాడు. “నా ఆరోగ్యం గురించి చాలా కొత్త వార్తలను వింటున్నాను. గైస్… నేను బాగానే ఉన్నా. కాస్తంత రక్తపోటు సమస్య ఉంది. అతి త్వరలోనే అంతా బాగుంటుంది. నాపై ప్రేమ చూపుతున్న వారికి కృతజ్ఞతలు. ఇది నా ఆరోగ్యం… మీది కాదు.. పుకార్లు సృష్టించవద్దు” అని వ్యాఖ్యానించాడు.