పుట్టినరోజు వేడుకలకు హరీశ్ దూరం!!

పుట్టినరోజు వేడుకలకు హరీశ్ దూరం!!

Hyderabad:

సోమవారం తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం.
“మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు.నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్ లో కాని, సిద్ధిపేటలోకాని ఉండడంలేదు. మందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటుూ.. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నా”.

– మీ హరీశ్ రావు.