పూరీ జగన్నథుడు అందరివాడేలే..

న్యూ ఢిల్లీ:
అన్య మతస్థులను అనుమతించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా పూరీ జగన్నాథ మందిరానికి సుప్రీంకోర్ట్ సూచించింది. సందర్శనార్థం వచ్చిన ఇతర మతస్థుల నుంచి అవసరమైతే అండర్ టేకింగ్ తీసుకోవాలని కోరింది. మతాలకు అతీతంగా ఆలయ ఆచారాలను అనుసరించి డ్రెస్ కోడ్ ప్రకారం వచ్చినవారందరికీ అవసరమైతే డిక్లరేషన్ వంటి ఏవైనా పత్రాలు స్వీకరించి మూలవిరాట్టుని దర్శించే అవకాశం కల్పించాలని జస్టిస్ ఏ.కె.గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం పూరీ జగన్నాథాలయానికి సూచించింది. హిందూ మతం వ్యక్తుల నమ్మకాల ఆధారంగా ఎంపిక, తిరస్కరణ చేయదని.. అందరినీ కలుపుకొని వెళ్లడాన్ని నమ్ముతుందని కోర్టు అభిప్రాయపడింది.