పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం.

భువనేశ్వర్:
పూరీ జగన్నాధుడి రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. భక్తుల జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలిసి రథాలపై జగన్నాథుడు గుండిచా మందిరానికి బయల్దేరాడు. రథయాత్ర సాగే పెద్ద వీధి ఆవరణ పురుషోత్తమ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ యాత్ర రెండు రోజుల పాటు సాగనుంది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.