పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ అరెస్ట్.

కొలంబస్;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై న్యాయపోరాటం చేస్తున్న శృంగార తార స్టార్మీ డేనియల్స్ ను ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్ట్రిప్ క్లబ్ లో డాన్స్ చేస్తున్న స్టార్మీ తనను తాకబోయిన ఓ కస్టమర్ ను అందుకు అనుమతించిందని పోలీసులు ఆమెపై అభియోగం మోపారు. దీనిని స్టార్మీ తరఫు న్యాయవాది మైకెల్ అవెనాటి తీవ్రంగా ఖండించారు. ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశంతో పన్నిన పన్నాగమని ఆరోపించాడు. నగర శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులను ఇలాంటి చిల్లర పనులకు ఉపయోగిస్తున్నారని ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చిన స్టార్మీ డేనియల్స్ ఎప్పటి మాదిరిగానే తనేం చేస్తుందో అదే చేసిందని.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమెను అరెస్ట్ చేశారని విమర్శించాడు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్పాడు. త్వరలోనే స్టార్మీ బెయిల్ పై బయటికి వస్తుందని.. ఆమెపై పెట్టిన దుష్ప్రవర్తన కేసు నిలిచేది కాదని తెలిపాడు. స్టార్మీ డేనియల్స్ అరెస్ట్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు మద్దతుగా పలువురు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇది కచ్చితంగా ట్రంప్ ప్రభుత్వ ప్రతీకార ధోరణిని చాటుతోందని విమర్శించారు. స్టార్మీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ క్లబ్ యజమానిని, ఆమెను తాకిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.