ప్రతి వారం 5 ప్రశ్నలు.చంద్రబాబుకు ‘కన్నా’ చిక్కు.

అమరావతి:
సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను చంద్రబాబుకు రాశారు. ఈ లేఖ ద్వారా ఐదు ప్రశ్నలు వేస్తున్నానని వాటికి ఆయన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతివారం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు వేస్తానని..వాటికి సమాధానాలు చెప్పాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1. టీడీపీ వెబ్ సైట్ నుంచి 2014 ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు? 2 .సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు చేసిన తొలి వాగ్దానాలు అమలు చేశామని చెప్పగలరా? 3. జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయాన్ని అంగీకరిస్తారా? 4.విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల ద్వారా ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయో చెప్పగలరా? 5. ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అనే మాటలు మీవి కావని చెప్పగలరా?