ప్రాణహిత ప్రాణం తీసిన కేసీఆర్. – పొన్నాల:

Hyderabad:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత ప్రాణం తీసి కాళేశ్వరం ప్రాజెక్టు కు పురుడు పోస్తున్నారని పీసీసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గ్రావిటీ ద్వారా 16.5 లక్షల ఏకరాలకు నీరు అందే అద్భుతమైన ప్రాజెక్టును పక్కన పడేసి 80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. 50 వేల కోట్లు వ్యయం చేసినా కనీసం 50 ఏకరాలకైనా నీరు ఇస్తున్నారా? అని పొన్నాల ప్రశ్నించారు.36 లక్షల ఎకరాలకు నీరు అంటూ పెద్ద అబద్ధం ఆడుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఉన్న నీరు ఎంత, ఎన్నీ ఎకరాలకు ఆ నీరు సరిపోతాయో వివరాలతో చర్చకు రాగలరా ? అని సవాలు చేశారు.జాతీయ ప్రాజెక్టు గా ప్రాణహితను చేయగలిగితే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన 11 వేల కోట్లతో కేంద్రం ఇచ్చే నిధులతో ఈ పాటికె ప్రాణహిత నీరు పొలాలకు అందేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కి పేరు వస్తున్నదని కుట్రతో తెలంగాణపైన లక్ష కోట్ల భారం వేసేందుకు కేసీఆర్ సిద్ధపడి కాళేశ్వరం కడుతున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు అన్నారు.కాళేశ్వరం లో ఎల్లంపల్లి అంతర్భాగంగా చూపిస్తున్నారని హేళన చేశారు. అన్నారం, సిందిళ్ళ పంపులు పూర్తి అయ్యాయా? అని ప్రశ్నించారు.ఇప్పుడు అన్ని పంపుల ద్వారా నీరు ఎల్లంపల్లి వరకు వస్తున్నదని చెప్పఁపగలరా?అని పొన్నాల ప్రశ్నించారు.
ప్రాజెక్టు పూర్తి కావడం అంటే భారీ పంపులు, సంపులు నిర్మించడం కాదని, పొలాలకు నీరు అందించడమని పొన్నాల తెలిపారు. క్రెడిట్ మొత్తం తనకే పేరు రావాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.