ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌ రాహుల్.

న్యూఢిల్లీ:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో కన్నుకొట్టడంపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌తో రాహుల్‌ను పోల్చుతున్నారు. మలయాళ సినిమాలోని ఓ పాటకు కన్నుకొడుతూ ప్రియా ప్రకాష్ వారియర్ యువతను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఒక్క సీన్‌తో ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ వైరల్‌గా మారిపోయింది. దీంతో పాటు మంచి స్టార్ డమ్ కూడా వచ్చినట్టైంది.
కాగా ప్రస్తుతం రాహుల్ చర్యను కూడా ప్రియా ప్రకాష్‌తో పోల్చుతూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌ రాహుల్’, ‘ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను బాగా ఫాలో అవుతున్నావా రాహుల్‌ జీ.. ఆమె కన్నుకొట్టిన వీడియో మరిన్ని చూడండి. ఇంకా ఇంప్రూవ్‌ అవుతారు’ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రియా ప్రకాష్, రాహుల్ ఒకేలా కన్నుకొట్టారని ఒకరా అని నెటిజన్ల ఒపీనియన్ అడుతున్నారు. కాగా ‘‘నాకు ఎంతో మధురమైన జ్ఞాపకమిది. నేను చాలా సంతోషపడుతున్నాను’’ అని ఇంతకు ముందు ఓ సందర్భంలో ప్రియా ప్రకాష్ చెప్పిన విషయం తెలిసిందే.