బాలికపై లైంగిక దాడి. ఎస్.సి.కమిషన్ తక్షణ స్పందన.

హైద్రాబాద్:
ఆదర్శ్ నగర్ లో 11 సంవత్సరాల బాలిక పై అత్యాచారం కేసుపై రాస్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  నిందితుడు రమేష్ ను తక్షణం రిమాండ్ కు పంపాలని ACP ని ఆల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఆదేశించారు. బాధితురాలికి తక్షణం పరిహారం అందించాలని ఆయన కలెక్టర్ ను కోరారు. రాజధాని నడిబొడ్డులో కూడా ఇటువంటి సంఘటన జరగటం విచారకరమని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేయరాదని, నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ కోరారు.
బాధితులకు కమిషన్ అండగా ఉంటుందని, కంపెన్సషన్ తో పాటు ఉన్నత విద్యా, ఉద్యోగం విషయం లోనూ కమిషన్ తోడ్పడుతుందని చైర్మన్ ప్రకటించారు.