న్యూ ఢిల్లీ.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ కలిసింది. బాలికల విద్య ప్రోత్సాహానికి అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ చైర్మన్, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జవదేవకర్ కు నివేదిక అందజేశారు. బాల్య వివాహాలను అరికట్టడానికి విద్యావకాశాలు ఎలా తోడ్పడుతాయనే విషయాన్ని కడియం శ్రీహరి మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు వివరించారు. భారతదేశంలో బాలికా విద్యను ఎలా ప్రోత్సహించాలనే అంశాన్ని పరిశీలించామని కడియం వెల్లడించారు. కేబ్‌నెట్ సబ్ కమిటీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కేబీజీబీవీలను పన్నెండో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయడంపై కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అప్‌గ్రేడ్ చేసిన క్రమంలో 15 మంది ఉపాధ్యాయులను కూడా కేటాయిస్తే బాగుంటుందని సూచించినట్టు తెలిపారు. ప్రతి సెక్షన్లో ఇప్పుడు 20 మంది విద్యార్థులను మాత్రమే తీసుకునే అవకాశం కల్పించారని…పన్నెండో తరగతిలో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను తీసుకునే అవకాశం కల్పించాలని, ఉపాధ్యాయులకు మంచి వేతనాలు చెల్లించాలని కేంద్ర మంత్రి జవదేకర్ ను కోరినట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.