బీజేపీకి ముందున్నది కష్టకాలం. -బాబా రాందేవ్ జోస్యం.

లండన్:
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పవని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. యోగా శిక్షణ ఇచ్చేందుకు లండన్‌ వచ్చిన ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓబీసీలు, దళితులు, ముస్లింలు ఏకమైతే ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని పేర్కొన్నారు. అయితే, అలా జరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చని, రాజ్యాంగంలోనే అది రాసి ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు మాత్రం తాము ఎవరిని కోరుకుంటే వారినే ప్రధానిని చేస్తారని పేర్కొన్నారు.