న్యూ ఢిల్లీ:
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఏ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి ఏతర కూటమి ఏర్పాటు లో బిజీగా ఉన్నారు. శనివారం ఆయన ఏపీ భవన్లో పశ్చిమ్ బెంగాల్ సీ.ఎం .మమతా బెనర్జీ తో భేటీ అయ్యారు. ఏపీ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు కీలకంగా చర్చిస్తున్నారు. అనంతరం చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దకు వెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలిపారు.