బీసీ బంధు కేసీఆర్- దానం నాగేందర్ కీర్తన.

హైదరాబాద్:
కొందరు కులవృత్తుల పై హేళనగా మాట్లాడుతున్నారని, సీఎం కెసిఆర్ కు ఆ వర్గాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రణాళిక ఉందని ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ పొగడ్తలతో ముంచెత్తారు.గతంలో పాలక వర్గాలు బీసీ లను కేవలం ఓటు బ్యాంకులు గానే చూశాయన్నారు.దేశం లో బీసీ లను చిత్తశుద్ధి తో ఆదరిస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ యేనని దానం చెప్పారు.బీసీలకు వంద శాతం సబ్సిడీతో పథకాలు ఇస్తున్నది సీఎం కెసిఆర్ ఒక్కరే నన్నారు.ఇతర పార్టీ ల్లోని బీసీ నాయకులు ఒక సారి తమ అంతరాత్మ ను ప్రశ్నించుకుంటే వాస్తవాలు భోధ పడతాయని తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కి 45 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించిన సీఎం కెసిఆర్ లా గతం లో ఎవరయినా ఆలోచించారా ?అని ప్రశ్నించారు.గతం లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలంటే ఏన్నో సార్లు ఆలోచించే వారన్నారు.బీసీ వర్గాలు కెసిఆర్ చేస్తున్న మేలును ఎప్పటికీ మరచి పోవని చెప్పారు.