బీసీ లెక్కలు తేలాకే పంచాయతీ ఎన్నికలు జరపాలన్న హైకోర్టు.

హైదరాబాద్:
బిసి జాబితాలను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బిసి కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బిసి గణాంకాలు తేల్చకుండా ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ బిసి కమిషన్ సర్వే రిపోర్ట్ చేయకుండా ఫైనాన్స్ కమిషన్ బిసి రిపోర్ట్ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ గ్రామ పంచాయితీ రాజ్ యాక్ట్ లో బిసి జనాభా 34 % ఉందని, శాసన సభ బిల్లు లో 37% పెట్టారు. సకల జనుల సర్వే లో 54 % పెట్టారు.ఈ మూడింటి లో ఏది నిజమని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించిన హైకోర్టు.బిసి కమిషన్ తో 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రకారము బిసి ల సమగ్ర జాబితాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.