బోధన్ మునిసిపల్ చైర్మన్ పై ‘విశ్వాసం’.

నిజామాబాద్:
బోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస రాజకీయానికి తెరపడింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో అసంతృప్తి తో ఉన్న మజ్లిస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతించారు. హైదరాబాద్ లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ కౌన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో భేటీ అయ్యారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ టిఆర్ఎస్ కొన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో సమావేశమయ్యారు. చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై ఇచ్చిన అవిశ్వాస నోటీసు ఉపసంహరించు కుంటామని ఎంపి కవితకు కౌన్సిలర్లు హామీ ఇచ్చారు.