బోనాలకు నగరం సిద్ధం.

హైదరాబాద్:
జాతరలో పాల్గొననున్న లక్షలాది భక్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఏర్పాట్లకు ఆలయాలకు ఆర్థికసహాయం. బోనాల పండుగకు నగరం సిద్ధమవుతోంది. తెలంగాణ పండుగ అయిన బోనాల జాతరను నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు ఇందులో పాల్గొని అమ్మవార్లకు తమ మొక్కులను తీర్చుకుంటారు. హిందువులు మాత్రమే జరిపే ఈ జాతరలో నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా నగరానికి తరలివచ్చి జాతర ఉత్సవాల్లో పాల్గొంటారు. జాతర జరిగే రోజుల్లో కచ్చితంగా నగరానికి వచ్చి ఇక్కడ జరిగే బోనాల జాతరలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు ప్రజలు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బోనాల ఉత్సవం జూలై 15 తేదీన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడదల చేసింది. ఈ మేరకు నగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. జూలై 15న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాల సమర్పణతో ఉత్సవం ప్రారంభం అవుతోంది. జూలై 29న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. 30న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆతరువాత ఆగస్టు 5న ఓల్డ్ సిటీలో బోనాలు జరగనున్నాయి. ఈ మూడు చోట్ల జరిగే బోనాల ఉత్సవాలకు భక్తులు సుమారుగా 35లక్షలకు పైగా హాజరవుతారని తెలుస్తోంది. వీటితో పాటూ దేవాదాయశాఖ పరిధిలోని సుమారుగా 89 దేవాలయాల్లోనూ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇవే కాకండా కాలనీలు, బస్తీల్లో ఉండే చిన్న చిన్న ఆలయాల్లో కూడా పండగ వాతావరణం అంబరాన్నంటుతుంది. బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అమ్మవారి కళ్యాణం జూలై 17న నిర్వహించనున్నారు. బోనాలకు ఆర్థిక సహాయం…బోనాల పండుగ ఉత్సవాలు జరిపే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఆర్థిక సహాయం పొందాలనుకునే దేవాలయాలు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటోంది. ఈ నెల 20లోగా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అధికారులు అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం పొందని దేవాలయాలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, హోంమంత్రి నాయిని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బోనాల పండుగ ఉత్సవాలు జరిపే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఆర్థిక సహాయం పొందాలనుకునే దేవాలయాలు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటోంది. ఈ నెల 20లోగా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అధికారులు అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం పొందని దేవాలయాలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, హోంమంత్రి నాయిని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 15న మొదటగా గోల్కొండ కోటలో బోనాల జాతర నిర్వహిస్తారు. ఆ తరువాత సికింద్రాబాద్… అనంతరం భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వచ్చే భక్తుల కోసం వాటర్ ప్యాకెట్స్, మహిళలు, వయో వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, విఐపి ప్రత్యేక లైన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు, మొబైల్ ట్రాన్స్‌పార్మర్లు, ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. గోల్కొండ కోటలో ప్రతి ఆదివారం, గురువారం జరిగే ఉత్సవాల్లో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. జాతరను వీక్షించేందుకు ఎల్‌ఈడీ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని అధికారులు నియమించారు.బంగారు బోనం సమర్పిస్తున్న సీఎం… ఈ నెల 29న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి 3.80కిలోల బంగారు బోనాన్ని సీఎం సమర్పించనున్నారు. మానేపల్లి జ్యూయలరీ సహాకారంతో 250కిలోల వెండితో అమ్మవారి గర్భగుడి ముఖద్వారం వెండి తాపడం చేపట్టడం జరుగుతోంది.