బ‌య్యారం స్టీల్ ప్లాంట్ కు స‌హ‌క‌రించాలి. ప్ర‌ధాని మోడిని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి.

న్యూఢిల్లీ:
ఢిల్లీ లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లోని ప్ర‌ధాన మంత్రి అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడి తో స‌మావేశ‌మ‌య్యారు. బ‌య్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఐటీఐఆర్ కు చేయూత‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడితో చ‌ర్చించారు.ముఖ్య‌మంత్రి కె. చంద్ర శేఖ‌ర్ రావు ఈ నెల‌ 15న ప్రధాని తో స‌మావేశ‌మైన సంద‌ర్భంలో విభ‌జ‌న హామిల‌తో పాటూ, 10 ప్ర‌ధాన‌మైన అంశాల‌పై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు. ఇందులో ముఖ్యంగా బ‌య్యారం స్టీల్ ప్లాంట్, హైద‌రాబాద్ లో ఐటిఐఆర్ అంశాల‌పై ముఖ్య‌మంత్రి కె. చంద్ర శేఖ‌ర్ రావు ప్ర‌ధానితో చ‌ర్చించిన సంద‌ర్భంలో ఈ అంశాల‌కు సంబంధించి మ‌రింత స‌మాచారంతో మంత్రిని పంపాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడి, ముఖ్య‌మంత్రి కె. చంద్ర శేఖ‌ర్ రావు సూచించారు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కె. చంద్ర శేఖ‌ర్ ఆదేశాల‌తో బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటిఐఆర్ కు సంబంధించి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌ధాని మోడికి అందించామని ఐటి శాఖ మంత్రి తెలిపారు.విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌రిచిన విధంగా బ‌య్యారం లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధానిని కోరామ‌ని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్వి వ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి బ‌య్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యాల‌ను ప‌రిశీలిస్తుంద‌ని మంత్రి వివ‌రించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఉన్న‌తాధికారుల‌తో ఒయ్యారం స్టీల్ ఏర్పాటు పై ఉన్న‌తాధికారుల‌తో అధ్యాయ‌న క‌మిటీ వేసింద‌ని, ఆ నివేదిక సైతం వ‌చ్చే నెల‌లో వ‌స్తుంద‌ని మంత్రి తెలిపారు. ఒయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే కావాల్సిన స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ప్ర‌ధాని మోడికి వివ‌రించామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం భఒడిశాలోని బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని 6 వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలోని విశాఖ కు త‌ర‌లిస్తున్నార‌ని, మ‌రి కేవ‌లం 180 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న బ‌య్యారానికి ఎందుకు ఇనుము త‌ర‌లించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌రాద‌ని ప్ర‌ధానికి దృష్టికి తీíకెళ్లామ‌ని మంత్రి వివ‌రించారు.
బైలాడిల్లా నుంచి బయ్యారానికి ఇనుము తరలించేందుకు అవసరమైన రైలు మార్గ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. బ‌య్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌డం వల్ల ఖ‌మ్మం జిల్లాలోని దాదాపు 15 వేల మంది గిరిజ‌నుల‌కు ఉపాధి దొరుకుతుంద‌ని మంత్రి తెలిపారు.కేంద్ర ప్ర‌భుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ముందుకు రాక‌పోతే, ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి వివ‌రించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న గ‌త ప్ర‌భుత్వం హైద‌రాబాద్, బెంగ‌ళూరు లలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని, కానీ అందుకు కావాల్సిన స‌హాకారం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అంద‌డం లేద‌ని ప్ర‌ధాని మోడికి వివ‌రించిన‌ట్లు మంత్రి తెలిపారు.ఐటీ రంగంలో అంతర్జాతీయ న‌గ‌రాల‌తో హైద‌రాబాద్ పోటీ ప‌డుతోంద‌ని, మ‌రింత అభివృద్ధి చెందే దిశ‌లో ఐటీఐఆర్ కు నిధులు మంజూరు చేయాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత వేగ‌వంతంగా కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు హైద‌రాబాద్ కు త‌ర‌లివ‌స్తున్నాయ‌ని, వీటికి మ‌రింత బ‌లం చేకూర్చేలా ప్ర‌త్యేక నిధులతో మౌళిక వ‌స‌తుల ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కోరినట్లు మంత్రి తెలిపారు.ప్ర‌ధాని న‌రేంద్ర మోడితో జ‌రిగిన స‌మావేశంలో కేటీఆర్ తో పాటూ, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ రెసిడెంట్ క‌మిష‌ర్ జి. అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.