‘భల్లాలదేవుని’కి ఆరోగ్య సమస్యలు !! బి.పి.తో బాధపడుతున్న రానా. కంటి ఆపరేషనా? కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషనా??

ఎస్.కె. జకీర్.
బాహుబలి సినిమాలో ఆజానుబాహుడిగా,అత్యంత బలవంతుడుగా తెరపై విశ్వరూపాన్ని ప్రదర్శించిన ‘భల్లాలదేవుడు ‘ తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రముఖ కథానాయకుడు, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రానా దగ్గుబాటి కి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు పీడిస్తున్నట్టు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలంటూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫెస్ బుక్ లో ఒక పోస్టు పెట్టింది. రానా తమ్ముడు అభిరామ్ తో ‘అత్యంత చనువుగా’ ఉన్న ఫోటోలను ప్రదర్శించి,పలువురు సినీ ప్రముఖులు కూడా తనను ‘వాడుకున్నారంటూ’ రచ్చ చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో కెక్కారు. “I am feeling sorry about rana sir’s health issue.. I hope it is small..get well soon..god bless you..” అని ఆమె పోస్ట్ చేసింది. రానా కొంత కాలంగా కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. రానా నటిస్తున్న ‘హాథీ మేరె సాథీ ‘ సినిమా షూటింగ్ వాయిదా పడడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. రానా ప్రచారాన్ని ఖండించారు. రక్తపోటు వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటికి మందులు వాడుతున్నానని అయన తెలిపారు. రక్తపోటు వల్ల కంటి శస్త్ర చికిత్సకు కొంత సమయం పడుతుందని రానా అన్నారు. “They are absolutely baseless rumours. I am as fit and fine as ever, and I’m raring to go. I do have some blood pressure issues that I’m currently addressing, and that has delayed my eye surgery, but that’s about it. There isn’t anything more to it. My current line-up of films has me all geared up and I’m busy shooting and shuttling between Mumbai and Hyderabad,” అని ఒక ఆంగ్ల పత్రికకు రానా చెప్పారు.