భారీవర్ష సూచన!!

Hyderabad:

హైదరాబాదు పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలిక పాటి నుంచి, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.