భూ రికార్డుల నవీకరణ- శుద్ధీకరణ -కలెక్టర్ సమీక్ష;

సిద్ధిపేట:

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి జిల్లాలోని భూ రికార్డుల నవీకరణ- శుద్ధీకరణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలు, అన్ని మండలాలకు చెందిన తహశీల్దార్లు, జిల్లాలోని అన్ని మండలాలలోని వీఆర్వోలతో సమీక్షించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందజేసే కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం 11 గంటల నుంచి డివిజన్లు, మండలాల వారీగా తహశీల్దార్లు, వీఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, సిద్ధిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, అన్ని మండలాలలోని రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.