మంత్రి జోగు రామన్న పుట్టినరోజు వేడుకలు.

ఆదిలాబాద్,:
రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న 55వ జన్మదిన వేడుకలు బుధవారం ఆదిలాబాద్ లో ఘనంగా జరిగాయి.మంత్రి జోగు రామన్న జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.టీ. రామారావు మంత్రి జోగు రామన్న కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారుమంత్రి జోగు రామన్న జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా సంబరాల జరుపుకున్నారు.రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జోగు రామన్న కేక్ కట్ చేశారు. సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలను , రిమ్స్ ఆస్పత్రిలో పండ్లను మంత్రి జోగు రామన్న పంపిణీ చేశారు.