మతం వన్నె పులులు.

త్రివేండ్రం:
మారుగా 20 ఏళ్ల పాటు ఓ మహిళపై లైంగిక దాడిచేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కేరళ క్రైస్తవ పూజారుల పై విచారణ జరుగుతోంది. వీరిలో ఇద్దరు తమను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి దరఖాస్తు చేశారు. ఓ వైపు దుర్మార్గులైన ఆ పూజారులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతుండగా చర్చికి చెడ్డపేరు తీసుకు రావద్దని బాధిత మహిళ, ఆమె భర్త పై క్రైస్తవ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. 1990లలో టీనేజీలో ఉండగా ఒక క్రైస్తవ పూజారి ఆమెను బలాత్కరించాడు. దీని గురించి ఆమె మరో పూజారికి తెలుపగా అతను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను లైంగికంగా వేధించాడు. ఇలా ఎందరు పూజారులకు చెప్పినా ఫలితం లేకపోగా వారు ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తమ లైంగిక వాంఛలు తీర్చుకున్నారు. ఇందులో కీలకపాత్ర పోషించింది అప్పట్లో చర్చిలోని ఓ విద్యార్థి. ఆమెను పెళ్లాడతానని మాయమాటలు చెప్పి ఆమెను పలుసార్లు అనుభవించాడు. అతను తన సెమినరీ ముగించి పూజారి అయిన తర్వాత ఇది కొనసాగించాడు. 2006లో వివాహం అయ్యాక కూడా వారు తమ లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ ఆపలేదు. చివరకు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భర్తతో ఈ బాధను చెప్పుకొంది.
కొట్టాయంలోని మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చికి చెందిన పూజారులు తన భార్యను అనేక సంవత్సరాలు లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ చేశారని ఓ 36 ఏళ్ల వ్యక్తి ఆరోపించాడు. చర్చి అధికారులతో అతను మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి ఆన్ లైన్ లో సర్కులేట్ కావడంతో ఈ దారుణం వెలుగు చూసింది. తమకు ఆ మహిళ తన ఫిర్యాదుతో అందజేసిన సాక్ష్యాధారాలు చూసిన పోలీసులకు కళ్లు తిరిగినంత పనైంది. ఆమె చర్చిలో చెప్పిన ఒప్పుకోళ్లను తమ స్వార్థానికి వాడుకొన్న పూజారులు బ్లాక్ మెయిల్ చేసి తమ కోరికలు తీర్చుకొనేవారు. ఈ ఆధారాలతో నలుగురు పూజారులపై పోలీసులు రేప్ కేస్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.