మన చెర్రీ దక్షిణాసియాలోనే అతి చిన్న పాప.

హైదరాబాద్:
హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. నాలుగు నెలలు ముందుగా 25 వారాలకే పుట్టిన పాపను బతికించారు. చెర్రీ అని పిలుస్తున్న ఈ పాప పొడవు 20 సెం.మీలు కాగా బరువు 375 గ్రాములు మాత్రమే. పాప పాదాలు కేవలం గోరంత పరిమాణంలో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో బిడ్డ జీవించే అవకాశాలు 0.5 శాతం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. శరీరావయవాలు ఇంకా పూర్తిగా ఏర్పడనందువల్ల జీవక్రియలు సరిగా పనిచేయక ఇలాంటి శిశువులు తీవ్ర ఇబ్బందులు కలిగి తరచుగా కాన్పులోనే కన్నుమూస్తారని తెలిపారు. రెయిన్ బో హాస్పిటల్ ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించగానే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చెర్రీ తల్లిదండ్రులకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాపను సురక్షితంగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యులకు అభినందనలు తెలుపుతున్నారు.