మరణంలోనూ వీడని స్నేహం.

హైదరాబాద్:
నిజ జీవితంలో మంచి స్నేహితులు.. ప్రమాదంలో కూడా వాళ్ళు ఒకరినొకరు విడలేము అంటూ కలిసి మృత్యు ఒడిలోకి పయనించారు. కొమురం భీం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని బాలాజీ నగర్ కు చెందిన తరుణ్ తేజ్, రాహుల్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ పని నిమిత్తం ఒకే బైక్ పై ఈస్ గాం గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో శివ మల్లన్న ఆలయం వద్దకు రాగానే వీరి బైక్ అదుపు తప్పి కల్వర్టు ను అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఎప్పుడు కలిసి ఉండే స్నేహితులు మరణం లో కూడా కలిసి మరణించడం పలువురి వృదాయాలను కలిచి వేసింది. వీరి మరణం తో ఇరు కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ మేరకు ఈ స్ గాం పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.