మరుగు దొడ్లు పూర్తి చేయాలి. – కలెక్టర్ శ్వేత.


wanaparthy:

పురోగతిలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణం తోపాటు, కొత్తగా మంజూరైన వాటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు.గురువారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ పై ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ మిషన్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ ఎక్కడైనా ఇంక నిర్మించాల్సిన మరుగుదొడ్లు ఉన్నట్లయితే తక్షణమే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని, అలాగే కొత్తగా మంజూరైన మరుగుదొడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకుగాను పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలోనే ఉండి వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో పురోగతి తక్కువగా ఉన్నందుకు గాను అజ్జకొల్లు గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ జీతాన్ని నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.