మహానాడు కు భారీ భద్రత: పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్.

విజయవాడ:
మహానాడుకు సంబంధించి 2 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.ట్రాఫిక్ సహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.పోలీసులతో పాటు స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్ల సేవలు కూడా‌ తిసుకొని బధ్రత పర్యవేక్షిస్తామని కమిషనర్ వెల్లడించారు.మహానాడు ప్రాంగణంతో పాటు సిటీ, చుట్టుపక్కల కూడా సెక్యురిటీ పెంచామని అన్నారు.ప్రజలకు ఇబ్బందులు లేకుంటా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.భారీ వాహనాలను నగరంలోకి అనుమతించకుండా రేపు రాత్రి నుంచి డైవర్షన్ చేపట్టామని పోలీసు కమిషనర్ తెలిపారు.సభా ప్రాంగణంతో పాటు సిటీ చుట్టుప్రక్కల కూడా సిసి కెమేరాలు, డ్రోన్ల సాయంతో నిఘా పర్యవేక్షణ ఉంటుందన్నారు
మహానాడు బధ్రతకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి నలుగురు ఐపిఎస్ లువస్తున్నారని తెలిపారు.అవసరమైతే అదనపు బలగాలను, ఇతర పోలీస్ సేవలనుఉపయోగించుకుంటామని గౌతమ్ సావాంగ్ వివరించారు.