మాజీ మంత్రి ముఖేష్ తో టిఆర్ఎస్ నేత మైనంపల్లి భేటీ.

హైదరాబాద్:
మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తో మంత్రి కేటీఆర్ అనుచరుడు, ఎం.ఎల్.సి., నగర టీఆరెస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు మంతనాలు జరిపారు. పార్టీ మారితే కార్యకర్తలు అనుచరులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ముకేశ్ గౌడ్ ఆదివారం అన్నారు.కాంగ్రెస్ లో బీసీ నేతలను అణగదొక్కుతున్నారన్న దానం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీసీలు యాచించే వారు కకూడదు. లాక్కునే వారు కావాలన్నారు.
బీసీలు ఎవరి కిందా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.బీసీలు దళితులు ముస్లిం మైనారిటీలు కలిస్తే ఎదురండదని ముఖేష్ వ్యాఖ్యానించారు.గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలంగా ఉందని మాజీ మంత్రి చెప్పారు.