“మాఫియాకు మీడియాకు జరుగుతున్న ధర్మ యుద్ధం”. – రవిప్రకాష్.

Hyderabad:

రవిప్రకాష్ ఇంకా దూకుడు కొనసాగిస్తున్నారు.
మాఫియాకు మీడియాకు జరుగుతున్న ధర్మ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుందని టీవీ9 మాజీ సి.ఈ.ఓ. రవిప్రకాష్ మంగళవారం రాత్రి
భాష్యం చెప్పారు.”టీవి9 ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు.నాపై దొంగ కేసులు పెట్టారు.నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టివి9 నుంచి బయటికి పంపించారు.పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్న” అని రవిప్రకాష్ అన్నారు.
అయితే పోలీసుల కథనం మరోలా ఉన్నది.
తాము అడిగిన ప్రశ్నలకు రవిప్రకాష్ సరైన సమాధానం ఇవ్వడం లేదని పోలీసులు అంటున్నారు.మంగళవారం రవిప్రకాష్ ను ఐదు గంటల పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటరాగేేషన్ చేశాారు.బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని రవిప్రకాష్ కు నోటీస్ ఇచ్చారు.