‘ముందస్తు’ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తథ్యం.

హైదరాబాద్:
ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ట్విట్టర్ లో ప్రకటించారు. 2019 లో షెడ్యూల్ ప్రకారమైనా, లేదా ఈ ఏడాది డిసెంబర్ లో అయినా విజయం కాంగ్రెస్ దే నని అన్నారు. అతి త్వరలోనే తెలంగాణలో అవినీతి, నిరంకుశ పాలన నుంచి ప్రజలు విముక్తి కానున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇది తెలంగాణ ప్రజలకు ముందస్తు శుభవార్త ‘ అని కూడా టిపిసిసి అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.