‘ముందస్తు’కు సన్నాహాలు! రేపటి ప్రధాని భేటీలో నిర్ణయం?

హైదరాబాద్;
ఈ ఏడాది చివరి లోగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ భారీ కసరత్తు జరుపుతున్నది. ప్రధానమంత్రి మోడీతో కెసిఆర్ శుక్రవారం జరిపే భేటీ లోనూ ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తావనకు రావచ్చుననిధిల్లీ రాజకీయ వర్గాలంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ గతంలో వ్యాఖ్యానించారని టిఆర్ఎస్వర్గాలంటున్నాయి. రాష్ట్రంలోఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంతట కనిపిస్తున్నట్టు ఆ వర్గాల కధనం. అలాగే‘ రైతుబంధు’ పథకం అమలుతో టిఆర్ ఎస్ ప్రభుత్వం మంచి ఊపు మీద ఉన్నది. రైతాంగం ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకి వస్తాయని అధికారపక్షం అంచనా. ఇక ఆగస్ట్ 15 నుంచి అమలుచేయదలచిన‘రైతుబీమా’ పధకం తో ‘వార్వన్సైడ్’ అవుతుందని వారి నమ్మకం. ఇక అటు ప్రతిపక్ష శిబిరాలు కకావికలమై ఉన్నవి. ‘అధికారపక్షం వేట’ కు ప్రతిపక్షాలు చెల్లాచెదురైనవి. కోదండరాం పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆయన బలం ఇంకా అంచనాకు అందడంలేదు. కోదండరాం ప్రభావం పెద్దగా ఉండదని,కొద్దోగొప్పో ఉన్నా అది కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తుందని టిఆర్ఎస్చెబుతున్నది. కాంగ్రెస్ప్రధానప్రతిపక్షంగా బలోపేతం కావడానికి ఇంకా తొలి ప్రయత్నాల్లో ఉందని కెసిఆర్ అభిప్రాయం. ప్రతిపక్షాలు ఒక ‘శిబిరం’ గాఏర్పడడానికిమరికొంత సమయం పడుతుంది. ఆ కూటమికి అభ్యర్థుల కొరత, ధనబలం లేమి పీడిస్తాయని టిఆర్ఎస్నాయకులంటున్నారు. ప్రతిపక్షాలుకోలుకోకముందే ఒక కూటమిగా ఏర్పడకముందే బలంగా దెబ్బ కొట్టాలన్నదికెసిఆర్ వ్యూహం అయి ఉండవచ్చును.

కాగా ఈ పరిస్థితుల్లోనే లోక్ సభ ఎన్నికలకు ముందస్తు వెళ్లేందుకు బిజెపి సిద్ధపడితే డిసెంబర్ లోగా ఎన్నికలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే మేలని బీజేపీభావన. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేల్లో జరగాల్సి ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. మరో మూడు పెద్ద రాష్ట్రాలు- రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల కాలపరిమితి 2019 జనవరిలో ముగుస్తుంది. ఇక సిక్కిం అసెంబ్లీ పదవీకాలం 2019 మేలోను, అరుణాచల్‌ ప్రదేశ్‌ది జూన్‌ 1న పూర్తవుతుంది. ఈ రీత్యా లోక్‌సభ ఎన్నికలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలనూ ఓ నాలుగైదు నెలలు ముందుకు జరిపి మొత్తం ఎనిమిది రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే తమకు రాజకీయంగా బాగుంటుందన్న విషయంపై బీజేపీలో చర్చలు సాగుతున్నాయి. జమిలీ ఎన్నికలు వీలవకపోతే నవంబరులో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇవి మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలు. రాజకీయంగా ఆ పార్టీకి అత్యంత కీలకం. ఒకవేళ నవంబరులో ఈ మూడింటికే గనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆ దెబ్బ లోక్‌సభ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. ఈ దృష్ట్యా జమిలీకి వెళితే- చాలా వరకూ ఈ వ్యతిరేకతను తట్టుకోవచ్చన్నది కమలనాథుల అభిప్రాయం. అయితే విపక్షాలు మాత్రంజమిలీ ఎన్నికలకు ససేమిరాఅంటున్నాయి. కాలవ్యవధి పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించడం తమకు సమ్మతం కాదని-కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి.”ఎన్నికల వ్యయం తగ్గించడానికి జమిలీ బెటరని మోదీ బయటకు అంటున్నప్పటికీఆయనదంతా రాజకీయ ఎత్తుగడే. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువలా ఉన్నపుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. వేసవిలో నిర్వహిస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు మరింతగా బయటపడతాయన్నదిఆయన భయం” అని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, లోక్‌ సభకూ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కేంద్రం చాలాకాలంగా చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపై కేంద్రంతో ఏకీభవిస్తున్నవి. కనీసం పాక్షికంగా నైనా ఈ ఆలోచనను అమలు చేస్తే క్రమంగా 2024 నాటికి అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దం చేయవచ్చని బిజెపి భావిస్తోంది.1951-52లో లోక్‌ సభకూ, దేశంలోని అన్ని అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1957, 1962, 1967 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. 1970లో లోక్‌సభ రద్దు కావడం, తర్వాత 1977లో లోక్‌ సభ పదవీకాలాన్ని పొడిగించడంతో అంతా తారుమారయ్యింది.జమిలీ ఎన్నికల నిర్వహణ మంచిదేగానీ- పాక్షికంగానైనా సరే.. డిసెంబరులో జరపడం అసాధ్యమని, 2024 వరకూ కూడా జరపలేమని మాజీ సీఈసీటీఎస్‌ కృష్ణమూర్తి ఓకే ఇంటర్వ్యూ లో చెప్పారు.”మనం బ్రిటిష్‌ (వెస్ట్‌ మినిస్టర్‌) తరహా వ్యవస్థను రూపొందించుకున్నాం. అమెరికన్‌ తరహా వ్యవస్థ అయితే నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఎవ్వరినైనాదించేసినామరొకర్ని ఎన్నుకునే పరిస్థితి అది. ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా కూలిపోతే (విశ్వాస పరీక్షలో ఓడిపోతే) నిర్దిష్ట కాలావధిలోగా ఎన్నికలు జరుపుతుంటాం.. లోక్‌సభకూ అంతే. జమిలీ తెస్తే ఇలా కుదురుతుందా? ఇలా కుదరాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. 2024లో కానీ అది వీలుపడదు” అని ఆయన అన్నారు.