మూడు రోజులుగా ఎన్.ఐ.ఏ ‘సెర్చ్’ఆపరేషన్

మూడు రోజులుగా ఎన్.ఐ.ఏ ‘సెర్చ్’ఆపరేషన్ – 20 మంది ‘ఇంటరాగేషన్.’

హైదరాబాద్:

‘ఐఎస్ఐఎస్’ సానుభూతి పరుల కోసం NIA గాలింపు చర్యలు సాగుతున్నవి.

హైదరాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు కొనసాగుతున్నది.పాతబస్తీ కి చెందిన పది మంది యువకులను NIA బుధవారం ప్రశ్నించింది.మరో నలుగురు ని అదుపు లోకి తీసుకొని బేగం పేట్ లోని NIA కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని NIA తన విచారణ ప్రక్రియ సాగిస్తున్నది.హుమయున్ నగర, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్ , బాలాపూర్ లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా NIA ‘ఆపరేషన్’ కొనసాగుతున్నది.