మెడికల్ కాలేజ్ లలో వైద్యుల భర్తీ. సచివాలయంలో సమీక్ష.

  • మెడికల్ కాలేజ్ లలో వైద్యుల భర్తీ.
    సచివాలయంలో సమీక్ష.

హైదరాబాద్:
రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో వైద్యుల భర్తీ పై మంత్రులు లక్ష్మారెడ్డి ,జగదీష్ రెడ్డి శుక్రవారం సమీక్షించారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చెయ్యాలని అధికారులకు మంత్రుల ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పనులను వేగవంతం చెయ్యాలని కోరారు. ఆరునెలల వ్యవధిలోనే భవనాన్ని నిర్మించే విధంగా ప్రణాలికలు రూపొందించాలన్నారు. భవన నిర్మాణాల నమూనాలను పరిశీలించిన మంత్రులు. జులై 7 లోపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు పొందాలని మంత్రులు ఆదేశించారు. వైద్యఆరోగ్య కార్యదర్శి శాంతికుమారి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కే .సురేంద్ర మోహన్, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్, టి యస్ యం యస్ ఐ డి సి యం.డి వేణుగోపాల్ రావు లతో పటు సూర్యాపేట, నల్గొండ మెడికల్ కళశాలల నోడల్ అధికారులు దండా మురళీధర్ రెడ్డి, నాగార్జునా చారి పాల్గొన్నారు.
సూర్యాపేట మెడికల్ కలశాల పనులను వేగవంతం చెయ్యాలని రాష్ట్ర ప్రబుత్వం నిర్ణయించింది. అందులో బాగంగా మెడికల్ కలశాలకు సరిపడు ప్రోఫెస్సర్లు, అసిస్టెంట్ ప్రొఫెస్సర్లను తక్షణం నియమించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం రోజు మధ్యాన్నం సచివాలయంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి ,విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గ జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలనాపరమైన అనుమతులను త్వరితగతిన పొందేలా చూడాలని వారు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూసేకరణ పై ఒక అభిప్రాయానికి వచ్చినందున తక్షణమే భూసేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు.
ఇప్పటికే కాళోజి నారయణ రావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సూర్యాపేటలో ఏర్పాటు చెయ్యనున్న మెడికల్ కళాశాల అనుమతుల కోసం పెట్టుకున్న ఆర్జీకి అనుమతులు లబించిన వెంటనే జులై 7 లోపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు పొందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.
మెడికల్ కలశాల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల నమూనాలను పరిశీలించిన మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి లు ఆరు నెలల వ్యవధిలో నిర్మాణాలు పూర్తి అయ్యేలా అందుకు సంబందించిన ఆర్దిక వెసులుబాటు కల్పించేలా చూడాలని వారు అధికారులకు చెప్పారు.
కాగా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్యఆరోగ్య కార్యదర్శి శాంతికుమారి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కే .సురేంద్ర మోహన్,వైద్య ఆరోగ్యశాఖా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ శివప్రసాద్, టి యస్ యం యస్ ఐ డి సి యం.డి వేణుగోపాల్ రావు లతో పటు సూర్యాపేట, నల్గొండ మెడికల్ కళశాలల నోడల్ అధికారులు దండా మురళీధర్ రెడ్డి,నాగార్జునా చారి తదితరులు పాల్గొన్నారు .
వైద్యుల ఖాళీలను భర్తీ చేసే విధంగా చర్యలు ఇదిలా ఉండగా ఇదే సమీక్షా సమవేశంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తో సహా సూర్యాపేట జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టు లను తక్షణం భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి ని కోరారు. మంజూరు అయిన పోస్టులు కూడా ఖాళిగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఆయన మంత్రి లక్ష్మారెడ్డి తో పాటు వైద్యఆరోగ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి తీసుకవచ్చారు .
ప్రధానంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మత్తు వైద్యుడు లేకపోవడంతో ఎదురౌతున్న ఇబ్బందులను మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమవేశంలో చర్చించారు.