మెడికో అనుమానాస్పద మృతి.

కర్నూలు:
జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. హాస్టల్ గదిలో హర్షప్రణీత్‌రెడ్డి అనే ఎంబీబీఎస్ విద్యార్థి ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడు పరీక్షల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే తమ అబ్బాయిని ఎవరో కొట్టి చంపారని మృతుడి తండ్రి రామానుజులరెడ్డి ఆరోపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. చనిపోయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని రామానుజులరెడ్డి అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.