యాజమాన్యంతో చర్చలు సఫలం. ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్:
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గత మూడు రోజులుగా “స్టూడియో-ఎన్ ” న్యూస్ ఛానెల్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో మంగళవారం నాడు యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలీకృతం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నట్లు టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు బకాయి ఉన్న జీతాల చెల్లింపు, సిఇఓ నీలిమా ఆర్య వేధింపులను నివారించడం, ఉద్యోగుల పట్ల కక్ష్య సాధింపు చర్యలు లేకుండా ఉండడం తదితర విషయాలపై ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లోకేష్ తో సామరస్య వాతావరణంలో చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఆయన తెలిపారు. దీంతో ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.