యాజమాన్యం వేదింపులతో జర్నలిస్ట్ మేకల.రమేష్ గుండె పోటుతో మృతి…

యాజమాన్యం వేదింపులతో జర్నలిస్ట్ మేకల.రమేష్ గుండె పోటుతో మృతి…

bhadradri kothagudem:

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విలేకరిగా మేకల.రమేష్ దాదాపు 15 సంవత్సరాలుగా పని చేసాడు. యాజమాన్యం గత సంవత్సరం కాలంగా తప్పుడు ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని విచారణల పేరిట పలుమార్లు డేట్ లైన్ అపుచేస్తు తీవ్ర మనోవేదనకు గురిచేసింది.గత నెలలో మరో పర్యాయం తప్పుడు ఫిర్యాదుతో తొలగిస్తున్నట్లు చెప్పింది.ఈ పరిణామంతో తీవ్రంగా తల్లడిల్లిన జర్నలిస్ట్ రమేష్ తన భార్య పిల్లలతో సహా ఖమ్మం వెళ్లి ఆ దినపత్రిక యాజమాన్యాన్ని కలిసి తమ ఆవేదనను మొరపెట్టుకున్నారు..ప్రాధేయ పడ్డారు..అయినప్పటికీ రమేష్ పై కనికరం చూపకుండా వదిలివేశారు.యాజమాన్యం తనపై అకారణంగా అసత్య ఆరోపణలతో తొలగించిందంటూ ఇల్లందు పట్టణంలో అనేక మంది వద్ద వాపోయాడు.తన వయోభారంతో ఇతర ఉద్యోగాలకు పనికి రాకుండా పోవడం,దళితుడనే వివక్షతలకు గురి కావడం,15 సంవత్సరాల పాటు రేయింబవళ్లు పత్రిక కోసం చేసిన సేవలు గుర్తించ లేదంటూ తల్లడిల్లుతూ ఆదివారం ఉదయం గుండెపోటు కు గురై మృతి చెందాడు.జర్నలిస్ట్ ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ యాజమాన్య ధోరణులను ప్రజాస్వామిక వాదులు,జర్నలిస్టులు,ప్రజాహిత సంస్థలు నిరసించాలి.జర్నలిస్ట్ రమేష్ కుటుంబానికి అండగా నిలవాలి.అతని కుటుంబాన్ని ఆదుకోవాలి.